సుబ్బిగాడు 1 రామాపురం, అక్కడున్న ఇరవై మూడు గ్రామాల్లో ఇదే అతి పెద్ద పల్లెటూరు. బస్సు స్టాండు దిగి బైటికి వచ్చి ఎడమవైపు తిరిగి నేరుగా ఒక కిలోమీటర్ నడిస్తే ఇళ్ళు మొదలవుతాయి అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే ఊరి మధ్యలో అంగడి. అంగడి నుంచి కుడి వైపు రోడ్డులో రెండవ వీధి నాలుగో ఇంటి ముందు పెద్ద టెంటు వేసి ఉంది. ఆ ఇంటి గేట్ ముందు చిన్న బ్యానర్ హారిక పుట్టిన రోజు వేడుక అని ఒక చిన్న పాపా ఫోటో. అది చూస్తూనే లోపలి అడుగు వేసాడు ఒక కుర్రాడు.

ఆ ఐదు అడుగుల మగాడిని చూసి అక్కడ టెంటు కింద కుర్చీలలో కూర్చున్న అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉండగా పింకు రంగు లంగా వోణీలో ఒంటి మీద మరి ఎక్కువా తక్కువా లేకుండా ఉన్న నగలతో మెరిసిపోతూ ఒక చేతికి వాచీ ఇంకో చేతినిండా మాచింగ్ గాజులు వేసుకుని, మరీ పొడుగు పొట్టి కాకుండా సరైన హైట్లో ఉన్న ఒక అమ్మాయి ప్లేట్ నిండా కూల్ డ్రింకుల గ్లాసులతో తన ఫ్రెండ్స్ కి అందిస్తూ మధ్యలో ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు ఇందాక బ్యానర్ మీద చుసిన హారిక లేదు తన అక్క, పేరు శరణ్య.

పేరుకి తగ్గట్టే చాల మంచిది కానీ డబ్బులు ఉన్నాయన్న పొగరు, ఆ అందానికి తగ్గ టెక్కు ఆమె సొంతం అందరూ ఎవరి గురించో మాట్లాడుకునేసరికి తల తిప్పి ఆ కుర్రాడిని చూసి పుసుక్కున నవ్వింది. ఆ గుంపులో కూర్చున్న ఒక అమ్మాయి ఎందుకే అలా నవ్వావు అని అడిగింది.

శరణ్య : మీరు వాడికి ఇస్తున్న బిల్డప్ చూసి ఎవరో అనుకున్నా… వాడని తెలిసి నవ్వొచ్చింది.

ఎవరు అతను.. చాలా సింపుల్గా ఉన్నాడు?

శరణ్య : ప్రతీ వారం ఒక కొత్త అమ్మాయిని ప్రేమిస్తాడు.

అదెలాగా?

శరణ్య : అదంతే వాడిని ఆ పిల్ల వదిలేస్తుంది.. లేదా ఇంకేదైనా జరుగుతుంది.. నష్ట జాతకుడు అంటారు కదా దానికి మనోడు అమ్మ మొగుడి లాంటోడు.. నాకు తెలిసినంత వరకు ఒక ఇరవై మంది అమ్మాయిలకి వీడి వల్లే పెళ్ళిళ్లు అయిపోయాయి.

అయ్యో పాపం.

శరణ్య : అంత లేదు, ఇప్పుడు చూడు మిమ్మల్ని చూసి ఒక వెకిలి నవ్వు నవ్వి నన్ను చూసి కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు..

శరణ్య చెప్పినట్టుగానే అమ్మాయిల వంక వీరుడిలా ఒక నవ్వు నవ్వి మధ్యలో ఉన్న శరణ్య వైపు చూసి సీరియస్ గా బ్యాగ్ తో లోపలికి వెళ్ళిపోయాడు.

ఎవరే అతను అంత కచ్చితంగా నువ్వు చెప్పిందే జరిగింది.

శరణ్య : వాడు నా అత్త కొడుకు పేరు సుభాష్.. ది సుబ్బిగాడు.. మంచి ఫన్నీ కాండిడేట్ మీకు బాగా టైంపాస్ అవుద్దని వాణ్ని పిలిపించాను..

episode-1

episode-2

మిగిలిన ఆడియో స్టోరీల కొరకు క్రింది లింక్ ను క్లిక్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా ఆడియోలను వినండి

click here